: ఎన్టీఆర్ షో రేటింగ్ ను దాటిన రానా షో రేటింగ్!


బుల్లి తెరపై ఎన్టీఆర్, రానాలు బిగ్ బాస్, నంబర్ వన్ యారీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న భారీ పాప్యులారిటీ కారణంగా బిగ్ బాస్ రియాల్టీ షోకు రేటింగ్ ఎక్కువగా వచ్చింది. అయితే వీకెండ్స్ లో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్లకు భారీ రేటింగ్ వస్తున్నా, మిగిలిన రోజుల్లో వ్యూయర్ షిప్ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రానా హోస్ట్ చేస్తున్న నంబర్ వన్ యారీ టీఆర్పీ క్రమేపీ పెరుగుతూ వచ్చి, తాజాగా బిగ్ బాస్ ను అధిగమించింది. గతంలో ఈ షోకు 9.1గా ఉన్న రేటింగ్.. లాస్ట్ వీక్ లో 10.3కు పెరిగింది. ఇదే సమయంలో బిగ్ బాస్ కు 6.23 రేటింగ్ వచ్చింది. మరోవైపు తెలుగు సీరియల్స్ మాత్రం మహిళా ప్రేక్షకులను కట్టిపడేస్తూ, తమ రేటింగ్ ను కొనసాగిస్తున్నారు.    

  • Loading...

More Telugu News