: ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు... స్పష్టం చేసిన హీరో నిఖిల్
నిశ్చితార్థం జరిగిపోయిందని, డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై నటుడు నిఖిల్ స్పందించాడు. `నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు. డిసెంబర్‌లో పెళ్లి అనేది అబద్ధం. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే నాకు లేదు` అని నిఖిల్ అన్నాడు. అలాగే ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించాడు.
`పెళ్లి విషయంపై స్పందించే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే పుకార్లకు ప్రాణం పోయకూడదనే స్పష్టత ఇస్తున్నాను. నేను సింగిల్, ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల మీదే నా దృష్టి కేంద్రీకరించాను` అని నిఖిల్ ట్వీట్ చేశాడు. గతంలో ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తానని నిఖిల్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.