: ఐఫోన్ 8 వచ్చే తేదీ ఇదే... మీడియాకు ఆహ్వానాలు పంపిన యాపిల్!


స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8 విడుదల తేదీని యాపిల్ ప్రకటించింది. ఈనెల 12న కుపిరింటోలో నిర్మించిన సంస్థ కొత్త క్యాంపస్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఐఫోన్ 8ను ఆవిష్కరిస్తున్నట్టు యాపిల్ సంస్థ మీడియాకు ఆహ్వానాలు పంపింది. మొత్తం 3 వేరియంట్లను సంస్థ విడుదల చేయనుందని సమాచారం. దీంతో పాటు అప్ గ్రేడ్ చేసిన యాపిల్ టీవీని కూడా సంస్థ విడుదల చేస్తుందని సమాచారం.

కాగా, కొత్త ఐఫోన్ వేరియంట్ లో సంప్రదాయ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. దీని స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ ను యాపిల్ తొలిసారిగా పరిచయం చేస్తోంది. ఇప్పటికే వచ్చిన లీక్ ల ప్రకారం, ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇక అన్ని ప్రధాన ఫీచర్లను, ఇన్ బిల్ట్ యాప్స్ ను కలిగివుంటుంది. ఆర్డర్ చేసుకున్న రెండు వారాల్లోగా యూఎస్ లో డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇది ఇండియాకు రావడానికి నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 8ను ఇండియాలో అక్టోబర్ లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

  • Loading...

More Telugu News