: ఉత్తర కొరియా సమీపంలో బాంబులేయించిన డొనాల్డ్ ట్రంప్... అమెరికాను పరిగెత్తిస్తానన్న కిమ్ జాంగ్ ఉన్!
ఉత్తర కొరియాను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశానికి సమీపంలో తమ యుద్ధ విమానాలతో బాంబులేయించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లోని దక్షిణ కొరియా ప్రాంతంలో శక్తిమంతమైన బాంబులను విమానాలు జారవిడిచాయి. జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ఓ ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ బాంబులను పరీక్షించాలని తన సైన్యానికి ఆదేశించినట్టు సమాచారం.
ఇక అమెరికా బాంబులేసిందన్న సంగతిని తెలుసుకున్న కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా స్పందించారు. తాను ఒక్క క్షిపణి పరీక్షను చేస్తే అమెరికా వెనక్కు పరిగెడుతుందని అన్నారు. ఇదో అనాగరిక చర్యని అభివర్ణించారు. తమ దేశ సరిహద్దుల్లో యూఎస్ బాంబర్లు, అమెరికా యుద్ధ విమానాలు ఉండటమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.