: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం గడువు పెంపు


పర్మినెంట్ ఎకౌంట్ నంబర్ (పాన్)తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన గడువును ఈ సంవత్సరం చివరి వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. నిజానికి గడువు నిన్నటితోనే అంటే, ఆగస్టు 31తో ముగియగా, డిసెంబర్ 31 వరకూ అవకాశం ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానంపై దాఖలైన కేసులను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు నవంబర్ లో విచారణ జరిపించనుందన్న సంగతి తెలిసిందే. వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువును కూడా డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ, గత వారంలో కేంద్రం వెల్లడించింది.

  • Loading...

More Telugu News