: కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ షురూ... తొలి రౌండ్లలో సైకిల్ జోరు!
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో సైకిల్ జోరు చూపిస్తోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ఒంటి గంటకల్లా తుది ఫలితాలు అధికారికంగా వెల్లడించనున్నారు. తొలి రౌండ్ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. నంద్యాల ఫలితం నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఈ ఫలితాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తొలి రౌండ్ ముగిసేసరికి ఏడు డివిజన్లలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైఎస్సార్సీపీ కేవలం మూడు డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది.