: కొలంబో వన్డేలో భారత్ ఘన విజయం!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన నాల్గో వన్ డే లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో లంక జట్టుపై టీమిండియా గెలుపు సాధించింది. దీంతో, వన్డే సిరీస్ లో భారత్ కు 4-0 ఆధిక్యం లభించింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 375 పరుగుల చేసింది. అనంతరం 376 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఓటమి పాలైంది. శ్రీలంక జట్టు 42.4 ఓవర్లకే ఆలౌట్ అయి, 207 పరుగులు మాత్రమే చేసింది.