: కడప జిల్లా స్పెషల్ కలెక్టర్ దుర్మరణం
కడప జిల్లా ప్రత్యేక కలెక్టర్ గోపీనాథ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. తిరుపతి నుంచి కడపకు సొంతంగా కారు నడుపుకుంటూ వస్తుండగా ఆయన గుండె పోటుకు గురయ్యారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపీనాథ్ అక్కడిక్కడే మృతి చెందారు. రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.