: అక్రమాస్తుల కేసులో జగన్ కు చుక్కెదురు.. సీబీఐ కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు!
అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ కాలంగా విచారణ ఎదుర్కుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వైఎస్ జగన్ తన న్యాయవాది ద్వారా ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు స్పందించిన హైకోర్టు... ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే సీబీఐ కోర్టులోనే ఇటువంటి పిటిషన్లు వేసుకోవాలని చివాట్లు పెట్టింది.