: ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ–39 ప్రయోగం విఫలం!


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఈ రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని కక్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టాలనుకున్నారు. అయితే, పీఎస్‌ఎల్‌వీ సీ–39 నుంచి ఉష్ణకవచం వేరుపడలేదు. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం విజయవంతం అయితే నావిగేషన్ వ్యవస్థలో కీలకంగా ఉండేది. పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయిందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ ప్రకటించారు. సాంకేతిక లోపం కారణంగా హీట్ షీల్డ్ విడిపోలేదని వివరణ ఇచ్చారు.

 

  • Loading...

More Telugu News