: నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళుతోన్న పీఎస్‌ఎల్‌వీ సీ–39!
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 హెచ్ (రీప్లేస్‌మెంట్) ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం నిన్న మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. పీఎస్‌ఎల్‌వీ సీ–39 మోసుకెళుతోన్న ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. నావిగేషన్ వ్యవస్థలో కీలకమైన ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1. 2013లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 ను ప్రయోగించారు. ఇప్పుడు దాని స్థానంలోనే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 హెచ్ (రీప్లేస్‌మెంట్) ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు.