: విజయవాడలో ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లు చింపేసి.. థియేటర్ లోకి చొచ్చుకెళ్లిన మహిళలు
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాపై మహిళలు మండిపడుతున్నారు. ఆ సినిమాలోని డైలాగులు, సీన్లు తమ పిల్లలను చెడుదారి పట్టించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని రాజ్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చించేశారు. అయినప్పటికీ ఆ సినిమా ప్రదర్శిస్తుండడంతో ఆగ్రహంతో థియేటర్లోకి చొచ్చుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, వారిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు.