: 'అర్జున్ రెడ్డి' సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత


అసభ్యకరమైన సన్నివేశాలు, డైలాగులతో యువతను పక్కదోవ పట్టించేలా ఉన్న 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సినిమాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువత పెడదారి పట్టేలా ఉన్న ఈ సినిమాను నిర్మించిన యూనిట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆయన కోరారు. మరోవైపు, ఈ సినిమాకు వ్యతిరేకంగా విజయవాడ మహిళలు కూడా ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News