: అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ ముస్లింల మార్చ్


అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్ చేస్తూ లక్నో నుంచి అయోధ్య వరకు మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ కో కన్వీనర్ కేఏ ఖుర్షిద్ అఘా వెల్లడించారు. సెప్టెంబర్ 11న లక్నో నుంచి బయల్దేరుతామని, 17వ తేదీకల్లా అయోధ్య చేరుకుంటామని చెప్పారు. మార్చ్ ద్వారా జనాల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మసీదును నిర్మిస్తే, ప్రార్థనలు ఎలా చేయగలమని ఆయన ప్రశ్నించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిమ్ లు చెడు అలవాట్లను వదులుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News