: ఆదిలోనే టీమిండియాకు షాక్.. తొలి వికెట్ డౌన్
శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా ఈ రోజు కొలంబో వేదికగా ఆడుతున్న నాలుగో వన్డే మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియాకు ఆదిలోనే శ్రీలంక షాక్ ఇచ్చింది. 1.3 ఓవర్ వద్ద ఫెర్నాండో బౌలింగ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 4 పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం మరో ఓపెనర్ రోహిత్ శర్మ 3 పరుగులతో, విరాట్ కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 5 ఓవర్లకి 30గా ఉంది.