: రేపిస్ట్ గుర్మీత్ బాబాపై రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకుంటున్న వర్మ?
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి సీబీఐ కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్మీత్‌కు సంబంధించిన అన్ని విషయాలను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుసుకుంటున్నాడట. అంతేకాదు, గుర్మీత్ బాబాగా నటించేందుకు బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకునేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. దీంతో గుర్మీత్ బాబాపై వర్మ సినిమా తీయనున్నాడని, త్వరలోనే ఈ విషయంపై వర్మ ప్రకటన చేస్తాడని సినీ విశ్లేషకుల అభిప్రాయం. గుర్మీత్ బాబా నిజ జీవితంలో చేసిన నేరాలనే కాకుండా ఆయన చేసిన మంచి పనులు కూడా ఈ సినిమాలో కనపడతాయని తెలుస్తోంది.