: ఉదారత చూపిన బాలకృష్ణ, 'పైసా వసూల్' నిర్మాత!


తన 101వ చిత్రం 'పైసా వసూల్' రేపు విడుదల కానున్న సందర్భంగా ఏపీలోని ఒక్కో జిల్లా నుంచి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసిన హీరో బాలకృష్ణ, నిర్మాత ఆనంద ప్రసాద్ లు రూ. 10 వేల చొప్పున ప్రతిభా పురస్కారాలను అందించి ఉదారతను చాటుకున్నారు. తన వెన్నంటి నిలిచిన అభిమానుల పిల్లల్లో 101 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకోగా, పదవ తరగతి, ఇంటర్ లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఈ పురస్కారాలను అందించారు. అనంతపురం జిల్లాలో గ్రంధాలయ సంస్థ చైర్మన్, బాలకృష్ణ అభిమాన సంఘం నేత గౌస్ మోహిద్దీన్ ఈ పురస్కారాలను బాలయ్య తరఫున అందించారు. పేద విద్యార్థులను అదుకునేందుకు నిర్ణయించుకున్న తమ హీరో, చిత్ర నిర్మాతలను ఆయన అభినందించారు. పురస్కారాలు రావాల్సిన వారందరికీ నగదును అందించనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News