: నా ఉనికికి కారణం వాడే.... గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ ట్వీట్
`నా అస్తిత్వానికి కారణం వాడు.. నన్ను నడిపించేది వాడు.. నా కుమారుడు.. నా ప్రపంచం.. నా ఆనందం.. పుట్టినరోజు శుభాకాంక్షలు, గౌతమ్.. ఆనందంగా ఉండు` అంటూ హీరో మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. గౌతమ్ 12వ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్, నమ్రతలకు 2006 ఆగస్టు 31న గౌతమ్ జన్మించాడు. 2012 జూలై 20న కూతురు సితార జన్మించింది. మహేశ్ నటించిన `1 నేనొక్కడినే` సినిమాలో చిన్ననాటి మహేశ్ పాత్రలో గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే.