: 99 శాతం 1000 నోట్లు వచ్చేశాయి: ఆర్బీఐ ప్రకటన


గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మూడు నెలలపాటు పాత నోట్లను తిరిగి ఆర్బీఐకి ఇచ్చేసేందుకు గడువును విధించింది. దీంతో పాత నోట్లు వెల్లువలా బ్యాంకులను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు ఆర్బీఐ రద్దు చేసిన పాత నోట్లపై తొలిసారి వార్షిక నివేదికలో పేర్కొంది. అందులో రద్దయిన కరెన్సీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినట్టేనని తెలిపింది.

ప్రధానంగా రద్దయిన 1,000 రూపాయల నోట్లలో సుమారు 99 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని చెప్పింది. 15.44 లక్షల కోట్ల విలువైన 1000, 500 రూపాయల నోట్లు రద్దు కాగా, 15.28 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా రావాల్సినవి 8,900 కోట్ల రూపాయల విలువైన 1000 నోట్లు మాత్రమే అని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News