: డిసెంబర్ 6 లోగా కాపు రిజర్వేషన్లు అమలు చేయకపోతే మా తడాఖా చూపిస్తాం: ముద్రగడ


అంబేద్కర్ వర్థంతి  డిసెంబర్ 6 లోపు కాపు రిజర్వేషన్లు అమలు చేయకపోతే సీఎం చంద్రబాబుకు తమ తడాఖా చూపిస్తామంటూ ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. కిర్లంపూడిలో కాపు జేఏసీ నేతలతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు నెలల్లోగా మంజునాథ నివేదిక వస్తుందని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వానికి రెండు నెలల గడువు విధించామని చెప్పారు.

 డిసెంబర్ 6 వరకు తన పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా త్వరలో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే డిసెంబర్ 6 తర్వాత నిర్వహించే నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని, ప్రభుత్వం ఏం చేసినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, నిజాలు చెప్పే వ్యక్తిని ఆ స్థానంలో చంద్రబాబు నియమించాలని ముద్రగడ సూచించారు.

  • Loading...

More Telugu News