: ‘ఇంటెక్స్’ నుంచి తక్కువ ధర కే 4జీ స్మార్ట్‌ఫోన్!
‘ఇంటెక్స్’ నుంచి తక్కువ ధరలకే మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ‘ఆక్వా స్టైల్ 3’ పేరిట మార్కెట్ లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,299 గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ ఫోన్ ప్రత్యేక విక్రయాలు జరపనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4జీ వీవోఎల్టీఈ సదుపాయం కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే..
5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఓఎస్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (64 జీబీ వరకు పెంచుకునే సౌలభ్యం ఉంది), 5 ఎంపీ రేర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా మొదలైన ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం.