: భార‌త్‌కు చైనా 20 బిలియన్ డాలర్లు ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది: చైనా ప్ర‌భుత్వాన్ని ఉలిక్కిప‌డేలా చేసిన వార్త


భార‌త్‌, చైనా, భూటాన్ స‌రిహ‌ద్దులోని డోక్లాంలో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌నకు తెర‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా చైనాలో ప్ర‌చార‌మైన ఓ వార్త ఆ దేశ ప్ర‌భుత్వాన్ని సైతం ఉలిక్కిప‌డేలా చేసింది. కేవ‌లం రెండు రోజుల్లో విప‌రీతంగా ఈ త‌ప్పుడు వార్త ప్ర‌చారం కావ‌డంతో అది నిజ‌మేన‌నుకొని చైనీయులు త‌మ సర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ ఆ వార్త‌లో ఏముందంటే డోక్లాం స‌మ‌స్య నేప‌థ్యంలో అక్క‌డి నుంచి సైన్యం వెనక్కి రావాలంటే మౌలిక వసతుల కల్పన కోసం 20 బిలియన్ డాలర్ల మేర రుణం ఇవ్వాలని చైనాకు భారత్ షరతు విధించిందని ఉంది.

ఆ వార్త‌ను ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ హిందుస్థాన్’ అనే వార్తాసంస్థ కూడా ధ్రువీక‌రించింద‌ని పుకార్లు వ‌చ్చాయి. చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ దీనిపై స్పందిస్తూ.. భార‌త్‌లో అస‌లు ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ హిందుస్థాన్’ అనే వార్తాసంస్థ లేద‌ని త‌మ ప్ర‌జ‌ల‌కు చెప్పింది. అలాగే భారత్‌లో చైనా కంపెనీలు వెనక్కి వెళ్లిపోవాల‌ని డిమాండ్ వ‌స్తోంద‌ని తెలిపింది. నిజానికి చైనానే ప్ర‌స్తుతం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది.

  • Loading...

More Telugu News