: సీఎం కిరణ్ మొహమాటపడిన వేళ...


ఏలూరులో నేడు జరిగిన బహిరంగ సభలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేడు కాసింత మొహమాటానికి గురయ్యారు. విషయం ఏంటంటే, ఆ సభలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేయాలని వేదికపైనుంచే సీఎంను కోరారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరు మద్యమే అని తెలిసిన సీఎం కిరణ్ ను కేంద్ర మంత్రివర్యుల డిమాండ్ ఇరకాటంలో పడేసింది. సభాముఖంగా కాదనలేక మొహమాటం కొద్దీ బెల్టు షాపుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేశారు సీఎం కిరణ్.

  • Loading...

More Telugu News