: చిన్న సింక్‌హోల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి... కాపాడిన పోలీసులు... వీడియో చూడండి
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా తాను అడుగుపెట్టిన చోట రోడ్డు కుంగిపోవడంతో ఆ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. విచిత్రం ఏమిటంటే, రోడ్డు కేవలం అతని పాదం వరకే కుంగిపోయి రంధ్రం పడటంతో అటుగా వెళ్తున్న వారందరూ ఆ వ్యక్తి రోడ్డు మీద కూర్చున్నాడేమో అని భ్రమ పడ్డారు. చివరి అతను సహాయం కోసం అర్థించడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ రోడ్డులో ఈ సంఘటన జరగింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తి కాలిని కష్టపడి ఆ సింక్‌హోల్ నుంచి బయటికి తీశారు. రోడ్డు మధ్యలో ఆ సింక్‌హోల్ ఎలా పడిందనే విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.