: నా గర్వం అణిచేది వాళ్లేనంటున్న రాశీ ఖన్నా!


టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఆమె గురించి తెలిసిన వారు అంటుంటారు. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న రాశీ, కవితలు రాస్తుంది, పాటలు పాడుతుంది, సామాజిక చైతన్యం కోసం షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో రాశీ తన స్నేహం గురించి వివరించింది. తాను అందరితోనూ కలివిడిగా ఉంటానని చెప్పింది. ఎవరితోనైనా స్నేహంగా ఉండడం తన స్వభావమని చెబుతుంటుంది. తనకు ఒక్కసారి ఎవరైనా పరిచయమై, మనసుకు నచ్చితే కనుక జీవితాంతం వారిని గుర్తుంచుకుంటానని చెబుతోంది. అందుకే తనకు స్నేహితులు ఎక్కువని చెబుతోంది.

తనకు నచ్చిన వారిని అంత త్వరగా విడిచిపెట్టనని, వారితో ఎప్పుడూ టచ్ లో ఉంటానని చెప్పింది. స్నేహితులు ఏదీ ఆశించరని చెప్పింది. తన స్నేహితులెవరూ తనను కధానాయికగా చూడరని, వారితో ఉంటే సాధారణ యువతిలానే ఉంటానని తెలిపింది. స్నేహితులతో ఆ వాతావరణం బాగుంటుందని తెలిపింది. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తినైనా ఏకవచనంతో పిలవొచ్చని చెప్పింది. ఆ హక్కు, అధికారం స్నేహితులకు మాత్రమే ఉంటుందని చెప్పింది. అలాగే స్నేహితులెవరూ సీక్రెట్స్ ఉంచుకోరని చెప్పింది. వారి దగ్గర తాను తానుగా ఉంటానని తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే తన గర్వం అణిచేది వారేనని తెలిపింది. రాశీ ఖన్నా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ' సినిమాలో నటిస్తోంది. 

  • Loading...

More Telugu News