: 200 మహిళలను మాయం చేసిన గుర్మీత్ బాబా...వెలుగు చూస్తున్న సంచలనాలు
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన తరువాత దేశవ్యాప్తంగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా పేరు మార్మోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు ఆయన పేరు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన సంచలనంగా మారారు. కాగా, శిక్ష పడి, జైలు కెళ్లిన అనంతరం ఈ రేప్ ల బాబా చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న 270 మందిపై అత్యాచారం చేసినట్టు ఆయన మాజీ బాడీ గార్డ్ ప్రకటించగా, తాజాగా మరో విషయం వెలుగుచూసి సంచలనం రేపుతోంది. బాబా ఆశ్రమంలోని చీకటి గదుల్లో 200 మంది మహిళల వరకు అదృశ్యమయ్యారన్న విషయం వెలుగు చూసి, సంచలనంగా మారింది. తాజాగా 18 మంది 18 ఏళ్ల వయసున్న టీనేజ్ అమ్మాయిలను బాబా చీకటి గుహల నుంచి పోలీసులు కాపాడారు.