: థ్యాంక్స్ డియర్ కోడలా!: అక్కినేని నాగార్జున‌


అక్కినేని నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు రాజుగారి గ‌ది-2 సినిమా ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పిక్చ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌కి హ్యాపీ బ‌ర్త్ డే చెబుతూ ‘మీరు నిజంగానే కింగ్ మామా’ అంటూ స‌మంత ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆమె ట్వీట్‌పై స్పందించిన నాగార్జున ‘థ్యాంక్స్ డియ‌ర్ కోడ‌లా.. యూ ఆర్ ది బెస్ట్’ అంటూ రిప్లై ఇచ్చారు.

కాగా, ఈ రోజు విడుదలైన రాజుగారి గ‌ది-2 సినిమా ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పిక్చ‌ర్‌లో నాగార్జున త‌న చేతిలో రుద్రాక్ష‌ల దండ‌ ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. నాగ్ చేతిలో ఈ రుద్రాక్ష‌లు చూస్తోంటే ఆయ‌న అభిమానుల‌కు శివ సినిమాలో సైకిల్ చైన్ గుర్తుకొస్తోంది. ‘అప్ప‌ట్లో సైకిల్ చైన్ ప‌ట్టుకుని హిట్ కొట్టారు.. ఇప్పుడు రుద్రాక్ష‌లు ప‌ట్టుకుని హిట్ కొడ‌తార‌’ని కామెంట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News