: డౌన్ టు ఎర్త్ అన్నారు.. లొకేషన్లో మట్టి తొక్కించారు!: వెన్నెల కిశోర్


టాలీవుడ్ కమెడియన్లలో ఒకడిగా వెన్నెల కిశోర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో హాస్యాన్ని ఒలకబోస్తూ ఆకట్టుకుంటున్న కిశోర్ ను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. తాజాగా ఆయన ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫొటోను వెన్నెల కిశోర్ ట్విట్టర్ లో లో షేర్ చేశాడు. డౌన్ టు ఎర్త్ అని చెప్పిన దర్శకుడు, చివరకు తనతో మట్టి తొక్కించారంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కొందరేమో... 'మట్టిలో మాణిక్యం - వెన్నెల కిషోర్' అంటూ కామెంట్ చేశారు. 

  • Loading...

More Telugu News