: గుర్మీత్ సింగ్ తన అనుచరులతో అక్కడ మలమూత్ర విసర్జన చేయించాడంటే...ఆ స్థలం ఇక అతనిదే!: గుర్మీత్ మాజీ బాడీ గార్డ్


డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేవలం అత్యాచారాలకు మాత్రమే పరిమితం కాలేదని, హత్యలు, భూకబ్జాలకు కూడా పాల్పడ్డాడని ఆయన వద్ద బాడీ గార్డ్ గా పని చేసిన బియాంత్ సింగ్ తెలిపారు. గుర్మీత్ సింగ్ చేయని దారుణం లేదని, హత్యలు చేయడం ఆయనకు సర్వసాధారణమని అన్నారు. ఏదైనా భూమి మీత అతని కన్ను పడితే, వెంటనే తన గూండాలను ఆ స్థలంపైకి పంపేవాడని గుర్తు చేసుకున్నారు. అక్కడ వారు మలమూత్ర విసర్జన చేసేవారని అన్నారు. అలా చేసిన తరువాత ఆ భూమిని దాని యజమాని ఎట్టిపరిస్థితుల్లో బాబాకే విక్రయించాలని ఆయన అన్నారు.

అలా చేయకపోతే తీవ్రపరిణామయాలు ఎదుర్కోవాల్సి ఉండేదని ఆయన తెలిపారు. పోనీ ఆ భూమికైనా సరైన ధరకట్టేవాడా? అంటే, అది కూడా జరిగేది కాదని, 20 లక్షల రూపాయల విలువైన భూమికి కేవలం ఒకటి, లేదా రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టేవాడని ఆయన చెప్పారు. ఆ ధరకు ఇవ్వమని ఎవరైనా మొండికేస్తే...ఆ భూమిని కబ్జా చేసేవాడని ఆయన తెలిపారు. గుర్మీత్ ఆశ్రమంలో నల్లధనం, అక్రమ ఆయుధాలు భారీగా పోగుపడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు కూడా ఉండడం విశేషమని ఆయన తెలిపారు. అంతే కాకుండా, 2007లో గురుగోవింద్‌ సింగ్‌ ను అనుకరించి సిక్కుల మనోభావాలను దెబ్బతీశాడని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News