: జిమ్‌లో చెమ‌టోడుస్తోన్న విరాట్ కోహ్లీని చూడండి!


శ్రీలంక టూర్‌లో ఉన్న టీమిండియా ఇప్ప‌టికే టెస్టు సిరీస్‌ను గెలుచుకుని వ‌న్డేల్లోనూ 3-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు తమకు స‌మయం దొరికిన‌ప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఫిట్‌నెస్ కోసం కఠోర శ్ర‌మ కూడా చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాను జిమ్ లో వ్యాయామం చేస్తుండ‌గా తీసిన ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. క‌ఠోర శ్ర‌మ‌ను ఎప్ప‌టికీ ఆప‌కూడ‌ద‌ని పేర్కొన్నాడు. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక‌తో టిమిండియా వచ్చే గురువారం నాలుగో వ‌న్డే ఆడ‌నుంది. ఈ వ‌న్డే కొలొంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే మూడు వన్డేలు గెలిచిన భారత్ నాలుగో వన్డే లేక ఐదో వన్డే ఏదో ఒక దానిలో గెలిస్తే కనుక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. 

  • Loading...

More Telugu News