: టెన్షన్ పెంచుతున్న ఉత్తరకొరియా రిపబ్లిక్ డే...యుద్ధానికి సర్వం సిద్ధమా?


ఉత్తరకొరియా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని దక్షిణకొరియా నిఘా సంస్థ యోన్హాప్ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, చైనా, రష్యా వంటి దేశాల ఒత్తిళ్లను కాదని ఉత్తరకొరియా తాజా పరీక్షలకు సిద్ధమవుతోందన్న వార్తలు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. సెప్టెంబర్ 9న ఉత్తరకొరియా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు ఉత్తరకొరియా సర్వం సిద్ధం చేసుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ యోన్హాప్ వెల్లడించింది.

కరువు కాటకాలతో ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజల కష్టాలు తీర్చేందుకు ముందుకు రాని ఉత్తరకొరియా ప్రభుత్వం అణుపరీక్షలకు మాత్రం ఉవ్విళ్లూరుతోందని యోన్హప్ తెలిపింది. ఇప్పటికిప్పుడు ఉత్తరకొరియాకు వచ్చే ముప్పేమీ లేదని, అయితే ఆ దేశం కావాలని కష్టాలు కొనితెచ్చుకోకూడదని యోన్హప్ హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధానికి సర్వం సిద్ధమా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. 

  • Loading...

More Telugu News