: గుర్మీత్ బాబాకు పదేళ్లు కాదు.. 20 ఏళ్ల జైలు శిక్ష!


డేరా సచ్ఛా సౌధా అధినేత, రాక్ స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్ రాం రహీం సింగ్ బాబాకు అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిందని న్యాయవాదులు తెలిపారు. ఇద్దరు మహిళలపై 2002లో దాఖలైన కేసులో చెరొక పదేళ్ల జైలు శిక్ష పడిందని వారు తెలిపారు. ఈ రెండు శిక్షలు ఒకేసారి అనుభవించడానికి వీలు లేదని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. దీంతో గుర్మీత్ రాం రహీం 20 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించనున్నట్టు తెలుస్తోంది. గుర్మీత్ సేవలను చూసి శిక్ష తగ్గించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరినప్పటికీ తోసిపుచ్చిన న్యాయమూర్,తి సహేతుకమైన శిక్ష విధించారని న్యాయవాదులు తెలిపారు. 

  • Loading...

More Telugu News