: నంద్యాల ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
నంద్యాలలో ప్రజల తీర్పును గౌరవిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేరిట ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది. ఈ ఎన్నిక ఫలితాలను సమీక్షించుకుని తాము ముందస్తు కార్యాచరణ వేసుకుని పనిచేస్తామని తెలిపింది. అధికారంతో సంబంధం లేకుండా తమ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పింది.