: సేవ చేస్తున్నా వదిలేయండి... పోనీ శిక్షనైనా తగ్గించండి!: జడ్జిని వేడుకున్న రాక్ స్టార్ బాబా


అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పదేళ్ల జైలు శిక్ష పడిన 'రాక్ స్టార్ బాబా' రాం రహీం గుర్మీత్ సింగ్ బాబా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వినగానే దిగ్భ్రాంతికి గురై, కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి న్యాయమూర్తిని ఉద్దేశించి, తాను సమాజసేవ చేస్తున్నానని, సోషల్ వర్కర్‌ గా తన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు.

తనను విడిచిపెట్టాలని, లేని పక్షంలో తన శిక్షను సమీక్షించి, తగ్గించాలని అభ్యర్థించాడు. దీంతో న్యాయమూర్తి మరో పదినిమిషాలు వాదనలు వినిపించడానికి ఆయన తరపు న్యాయవాదికి సమయమిచ్చారు. అనంతరం సీబీఐ న్యాయవాది వాదనలు విన్నారు. ఈ సందర్భంగా గుర్మీత్‌ కు పదేళ్ల జైలుశిక్ష చిన్నదని, దానిని పెంచాలని సీబీఐ న్యాయవాది బలంగా తన వాదన వినిపించారు. దీంతో అతనికి పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. 

  • Loading...

More Telugu News