: పెళ్లికి సిద్ధమైన 55 ఏళ్ల ఆమె, 22 ఏళ్ల అతను.. ఎక్కడో కాదు.. హైదరాబాదులోనే!


ఇలాంటి ఘటనలు పాశ్చాత్య దేశాల్లో సాధారణమైనవే కావచ్చు. కానీ, మన దేశంలో ఇది మామూలు విషయం కాదు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో ఓ కొరియర్ సంస్థలో పని చేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో ఆమెకు చనువు ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం కూడా ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇది తెలుసుకున్న కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో... వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్ సయ్యద్ వీరిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికే వీరిద్దరూ కట్టుబడటంతో, ఏమి చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. వారం తర్వాత మళ్లీ స్టేషన్ కు రావాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, వారం తర్వాత మత పెద్దల సమక్షంలో మాట్లాడి, ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News