: మరింత బాధ్యతతో పనిచేస్తాను: భూమా బ్రహ్మానందరెడ్డి
భూమా నాగిరెడ్డి నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని ప్రజలు తెలుసుకున్నారని భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈ రోజు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ... భూమా నాగిరెడ్డికి నివాళులుగా ప్రజలు తనకు ఓట్లు వేశారని అన్నారు. నంద్యాలలో చేస్తోన్న అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లామని అన్నారు. తమకు పదవులపై ఎటువంటి వ్యామోహం లేదని, మున్ముందు కూడా ప్రజా సేవకే అంకితం అవుతామని వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డిలాగే నంద్యాల అభివృద్ధికి తాను కూడా కృషి చేస్తానని అన్నారు.