: ధర్మానికి, న్యాయానికి ఓటు వేయమని జగన్ చెప్పారు.. ప్రజలు అదే చేశారు: మంత్రి ప్రత్తిపాటి
నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రచారం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధర్మానికి, న్యాయానికి ఓటు వేయమని ప్రజలకు చెప్పారని, ప్రజలు నిజంగానే అదే పనిచేసి ధర్మంవైపు నిలబడే తమ పార్టీకి ఓటు వేశారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చురకలంటించారు. రాయలసీమలో రెచ్చిపోయి మాట్లాడితే ఓట్లొస్తాయని జగన్‌కి పీకే సలహా ఇచ్చాడని, అది రివర్సైపోయి జగన్ తాను తీసుకున్న గోతిలోనే పడ్డాడని అన్నారు. నిరంతరం అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ తీరుకి వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు జగన్‌కి ఓటమిని కట్టుబెట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ఇది శిల్పా మోహన్ రెడ్డి ఓటమి మాత్రమే కాదని, జగన్ తీరుకి ప్రజలు చెప్పిన తీర్పని వ్యాఖ్యానించారు.