: పళని, పన్నీర్ లకు కొత్త తలనొప్పి... 40 మంది ఎమ్మెల్యేల జంప్?


ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్న వేళ, ఆ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేడు జరిగిన కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలకు కొత్త తలనొప్పి మొదలైంది. దినకరన్ వర్గం బలం పెరుగుతోందన్న సంకేతాలు మరింత బలంగా వెలువడుతున్నాయి.

శశికళ వర్గీయులపై పూర్తిగా వేటు వేసే దిశగా, నేడు రొయ్యపెట్టలో సమావేశం కావాలని అన్నాడీఎంకే శాసనసభాపక్షం పిలుపునివ్వగా, 40 మంది ఎమ్మెల్యేలు రాలేదు. ఇప్పటికే 22 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఓ రిసార్టులో మకాంవేయగా, ఇప్పుడు మరింత మంది పళనికి వ్యతిరేకంగా మారడం గమనార్హం. ఇక దినకరన్ కు అనుకూలంగా స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయని, ఆ ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా దినకరన్ వెంట వెళ్లిపోతారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News