: కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయిన శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం ఖరారైంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటమి స్పష్టంగా తెలుస్తోంది. పదో రౌండ్ లో కూడా టీడీపీనే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ రౌండ్ లో 1486 ఓట్ల ఆధిక్యాన్ని భూమా బ్రహ్మానందరెడ్డి సాధించారు. పదో రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి 19,657 ఓట్ల ఆధిక్యాన్ని పొందారు. ఈ నేపథ్యంలో, ఓటమి ఖాయమైన దశలో శిల్పా మోహన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన ముఖంలో ఎంతో ఆవేదన కనిపించింది. అయితే, ఈ ఫలితాలతో తాను కుంగిపోనని... పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత మాట్లాడతానంటూ ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు.