: త్వరలో వాట్సాప్ బిజినెస్... స్పష్టం చేసిన కంపెనీ
ప్రస్తుతం వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదనడంలో అతిశయోక్తి లేదేమో! ఈ కారణంతోనే బిజినెస్ పరంగా కూడా వాట్సాప్ సేవలను వినియోగించుకోగల సదుపాయాన్ని త్వరలో కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా వెబ్సైట్లో కంపెనీ పెట్టిన సమాచారంతో ఈ విషయం స్పష్టమైంది. కొన్ని వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్లకు ఈ సదుపాయాన్ని ముందుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెబ్సైట్లో పేర్కొంది. ఈ సదుపాయం వల్ల ఫోన్‌బుక్‌లో ఉన్న బిజినెస్ కాంటాక్ట్ నెంబర్లకు ప్రత్యేకంగా ఒక టిక్ మార్కు ఉంటుందని, అలాగే ఆ నెంబర్‌తో చేసిన ఛాటింగ్ డిలీట్ చేయడానికి వీలు లేకుండా ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఒకవేళ ఆ కాంటాక్ట్‌తో బిజినెస్ చేసే ఉద్దేశం లేకపోతే బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. అలాగే సంబంధించిత బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా కాంటాక్ట్ వద్దే కనిపిస్తాయని చెప్పింది.