: జగన్ మోహన్ రెడ్డి! మీరు తలవంచుకోవాలి : మంత్రి సోమిరెడ్డి


నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని, ఇరవై ఐదు వేల మెజార్టీతో తమ పార్టీ గెలుపు ఖాయమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్ మోహన్ రెడ్డి!, మీరు తలవంచుకోవాలి..మీరు ఒప్పుకోవాలి. ఇది నంద్యాల ప్రజలు ఇస్తున్న తీర్పు. ఎన్నికల ప్రచారంలో జగన్ మరో మాట అన్నారు.. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికలు ఓ సందేశం కావాలని అన్నారు. 2019లో చంద్రబాబుగారి నాయకత్వం రావాలని నంద్యాల ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్, ఆయన బృందానికి నంద్యాల ప్రజలు ఓ మెసేజ్ ఇచ్చారు. అయ్యా, జగన్..రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దయచేసి రోజాగారిని అన్ని నియోజకవర్గాల్లో తిప్పండి. ఇదే జోష్ లో మాట్లాడండి. నంద్యాలలో మాట్లాడినట్టుగానే మాట్లాడండి. వైసీపీకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News