: ధైర్యంగా తీసిన సినిమా.. విజయ్ దేవరకొండ ఇరగదీశాడు: కేటీఆర్
వివాదాస్పద పరిణామాల మధ్య విడుదలై, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఇరగదీశాడంటూ కితాబిచ్చారు. దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. నిజాయతీని ప్రతిబింబించే, మనసును హత్తుకునే సినిమా ఇది అని చెప్పారు. ఇలాంటి రిస్కీ సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని తెలిపారు.