: 8:45 గంటలకు నంద్యాల ఎన్నిక తొలి రౌండ్ ఫలితం.... సర్వత్ర ఉత్కంఠ!
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభం కానుంది. ఫలితాలపై అటు టీడీపీ, ఇటు వైసీపీలు టెన్షన్‌గా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ మొదట పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభించనుంది. అనంతరం ఈవీఎంలు లెక్కిస్తారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. తొలి రౌండ్‌లో నంద్యాల రూరల్ ఓట్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. రెండో రౌండ్ నుంచి నంద్యాల అర్బన్ ఫలితాలు వెల్లడవుతాయి. ఉదయం 8:45 గంటలకే తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉదయం 9:30 గంటల కల్లా ట్రెండ్ తెలిసిపోనుంది. 10:10 కల్లా ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం ఉంది.