: సినీ ఇండస్ట్రీలో వీడు పనికిరాడనుకుంటే డస్ట్ బిన్ లో పడేస్తారు: పోసాని కృష్ణమురళి


తాను రైటర్ గా, డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయిపోయానని, ఇలాంటి అదృష్టం అందరికీ రాదని, చాలా తక్కువ మందికి వస్తుందని  ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. కానీ, ‘నాయక్’ సినిమా తర్వాత కేవలం వారం రోజుల్లోనే చాలా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో, మాటలు రాయడం, దర్శకత్వం వహించడం పక్కన పెట్టాను. అప్పటి నుంచి ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయిపోయాను. ఆర్టిస్ట్ గా నాకు చాలా బాగుంది. డబ్బు, రెస్ట్, ప్రశాంతత విషయంలో ఇప్పుడు నాకు హాయిగా వుంది’ అన్నారు.

‘పోసానిలో రచయిత చచ్చిపోయాడా?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘సినీ ఇండస్ట్రీలో వీడు పనికి రాడనుకుంటే డస్ట్ బిన్ లో పడేస్తారు. కానీ, నేను ముప్పై రెండేళ్ల నుంచి పనికొస్తూనే ఉన్నా. నన్ను డస్ట్ బిన్ లో పడేయాలంటే.. నా కన్నా బాగా రాసేవాళ్లు, నా కంటే టాలెంటెడ్, నా కంటే దమ్మున్నోళ్లు, నా కంటే స్పార్క్ ఉన్నాడు  వస్తే, అప్పుడు నాకు కొంచెం భయమేస్తుంది. అయినా,  చాలా తక్కువ సమయంలో వంద సినిమాలకు మాటలు రాశాను’ అని చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News