: ఈ నాలుగు పాయింట్లు చాలు మేము గెలుస్తామని చెప్పడానికి: శిల్పా మోహన్ రెడ్డి


నంద్యాల ఉపఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ లోనే కాకుండా యావత్తు రాష్ట్రంలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ న్యూస్ ఛానెల్ తో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘మూడు, నాలుగు పాయింట్ల ఆధారం గా మా గెలుపునకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి జగన్ సమ్మోహనా శక్తి, అదే విధంగా వైసీపీకి ప్రజల్లో ఉన్న బలం, మా వ్యక్తిగత బలం, ప్రభుత్వ వ్యతిరేకత. ఈ నాలుగు పాయింట్లను ఆధారంగా చేసుకుని పోలింగ్ సరళి పెరిగింది. దీంతో, మా గెలుపునకు అవకాశాలు ఉన్నాయి. నంద్యాలలో నేను గెలుస్తాను. అందులో, ఎటువంటి డౌట్ లేదు. అయితే, ఎంత మెజార్టీతో అనే విషయాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News