: చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకుంటే అది వినాయకుడు ఇచ్చాడు!: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్


చిన్నప్పటి నుంచి  తాను ఏదికోరుకుంటే అది గణేశుడు ఇస్తున్నాడంటూ బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ అన్నాడు. వినాయకచవితి సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ప్రముఖ బౌగ్చా గణేశ్ విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నాడు. వినాయకచవితి అంటే తనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుందని, చిన్నప్పుడు ఈ పండగ వచ్చిందంటే చాలు స్వీట్ల కోసం ఎదురుచూసే వాడిని అని అన్నాడు. ఇప్పుడు తమ ఇంటికి వచ్చే అతిథులకు స్వీట్లు ఇవ్వడంలోనే ఆనందం ఉందని చెప్పాడు. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘అగ్నిపథ్’ లో హృతిక్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో వినాయకుడికి సంబంధించిన ఓ పాట ఉంది. ఈ పాటను పాడింది హృతిక్కే. ఈ పాటలో తాను భక్తుడిలా లీనమై నటించానని హృతిక్ చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News