: బాక్సింగ్ పోరు: గంటలో రూ. 1,280 కోట్లు ఎగరేసుకుపోయిన మేవెదర్


దాదాపు గంట సేపు సాగిన బాక్సింగ్ పోరులో ప్రత్యర్థి కానర్ మెక్ గ్రెగర్ ను మట్టి కరిపించిన ఫ్లాయిడ్ మేవెదర్ సుమారు రూ. 1,280 కోట్లను ఎగరేసుకుపోయాడు. దాదాపు రూ. 1,700 కోట్ల ప్రైజ్ మనీగా పోరు సాగగా, ఓటమి పాలైన గ్రెగర్ కు రూ. 400 కోట్లు దక్కాయి. రెండు సంవత్సరాల క్రితం పకియావ్ తో పోటీ పడిన తరువాత ప్రొఫెషనల్ బాక్సింగ్ కు వీడ్కోలు పలికిన మేవెదర్, ఆపై మనసు మార్చుకుని మరోసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ తాజా పోరులో విజయంతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 50 మ్యాచ్ లు గెలిచిన అరుదైన రికార్డును మేవెదర్ సొంతం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం మేవెదర్ మాట్లాడుతూ, తాను ఊహించినదానికన్నా గ్రెగర్ బలవంతుడని, ఈ పోటీ చాలా కష్టంగా సాగిందని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News