: కాకినాడలో మొదలైన కాంగ్రెస్ ర్యాలీ!


కొద్దిసేపటి క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌. ర‌ఘువీరారెడ్డి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్విచక్ర వాహనాల ర్యాలీని చేపట్టారు. ఈ ఉద‌యం 9-30 నిమిషాల‌కు 31వ వార్డు పరిధిలోని బ్యాంకు పేట నుంచి ర్యాలీ ప్రారంభంకాగా, వివిధ వార్డుల గుండా సాగే ర్యాలీ, అన్న‌మ్మ ఘాట్ మీదుగా దేవాల‌యం వరకూ సాగనుంది.

ఆపై కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాల‌యంకు బైక్ ర్యాలీ చేరుకోనుండగా, అక్కడ జరిగే సభతో కాంగ్రెస్ ప్రచారం ముగియనుంది. తెలుగుదేశం, బీజేపీలతో పాటు వైకాపా సైతం ప్రజలను మోసం చేస్తున్నదని, ఈ ఎన్నికల్లో కాకినాడ ప్రజలు ఆ మూడు పార్టీలకూ బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News