: మైక్ టైసన్, కింగ్ జేమ్స్ చూస్తున్న వేళ... కొదమ సింహాల్లా పోరాడుతున్న మేవెదర్, మెక్ గ్రెగోర్


'ఫైట్ ఆఫ్ ది మిలీనియమ్'గా బాక్సింగ్ క్రీడాభిమానులు చెప్పుకుంటున్న కీలక పోరు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. లాస్ వెగాస్ లోని టీ-మొబైల్ అరీనాలో సుమారు 20 వేల మంది ప్రేక్షకుల నడుమ ఫ్లాయిడ్ మేవెదర్, కానర్ మెక్ గ్రెగోర్ లు కొదమ సింహాల్లా తడబడుతున్నారు. ప్రఖ్యాత హెవీ వెయిట్ బాక్సింగ్ పూర్వపు చాంఫియన్లు మైక్ టైసన్, కింగ్ జేమ్స్, ఓజీ ఓస్బర్న్ తదితరులు చూస్తున్న వేళ, ఇరువురు బాక్సింగ్ వీరులూ కొదమ సింహాల్లా పోరాడుతున్నారు.

ఇప్పటివరకూ ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. తొలి రౌండు నుంచే మెక్ గ్రెగోర్ తన బలమైన పంచ్ లను మేవెదర్ పై కురిపిస్తూ, ఆధిక్యంలోకి దూసుకెళుతున్న పరిస్థితి నెలకొంది. నాలుగో రౌండులో మాత్రం మేవెదర్ కొంత పుంజుకున్నట్టు కనిపించి, ఆపై ఐదు, ఆరు రౌండ్లలో గ్రెగోర్ ఆధిపత్యం కొనసాగింది. మరికాసేపట్లో పోరు ముగియనుండగా, ఎవరూ నాకౌట్ కాకుంటే, పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News