: మరో మృత్యు ఘోష... జంషడ్ పూర్ లోని ఆసుపత్రిలో 52 మంది చిన్నారుల మృతి
ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన విషయం మరువకుండానే అదే తరహాలో ఘటన మరొకటి జరిగింది. జార్ఖండ్ లోని జండెష్ పూర్ లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన నెల రోజుల వ్యవధిలో 52 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ చిన్నారుల మృతికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాకపోగా, సరైన పోషకాహారం లభించని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. చిన్నారుల మరణాలు నిజమేనని ధ్రువీకరించారు. కాగా, చిన్నారుల మృతిపై మరింత సమాచారం తెలియాల్సివుంది.